Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుపతి కౌంటింగ్ కేంద్రంలో అగ్నిప్రమాదం

  • షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్న అధికారులు
  • ఏసీలో మంటలు
  • పోలింగ్ కు ముందు రోజు కూడా ఇక్కడ అగ్నిప్రమాదం
తిరుపతిలో ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఇవాళ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతిలోని ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కాలేజిలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తుండగా మంటలు చెలరేగాయి. ఏసీ యంత్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. అగ్నిప్రమాదం జరగడంతో అక్కడున్న వారు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు రంగప్రవేశం చేసి మంటలను ఆర్పేశారు.

కాగా, ఇదే కాలేజీలో పోలింగ్ కు ముందురోజు కూడా అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో మానిటరింగ్ రూమ్ లోని ల్యాప్ టాప్ లు అగ్నికి ఆహుతయ్యాయి. మళ్లీ అదే కేంద్రంలో అగ్నిప్రమాదం జరగడం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tirupati

More Telugu News